: ఒకరికి మోదం...మరొకరికి ఖేదం
ఐపీఎల్ సీజన్ 7 లో నేడు ఒకరికి మోదం...మరోకరి ఖేదం ఎదురవ్వనుంది. నిన్న వర్షం కారణంగా నేటికి వాయిదా పడిన పంజాబ్ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ లో ఎవరు గెల్చినా వారు నేరుగా ఫైనల్ కు చేరనున్నారు. ఓడిన వారు ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో గెలిచిన వారితో ఫైనల్ బెర్తుకోసం పోటీ పడతారు. కాగా ముంబై, చెన్నై మ్యాచ్ లో ఓటమి పాలైనవారు మాత్రం నేరుగా ఎలిమినేట్ అవుతారు. గెలిచిన వారు ఫైనల్లో చోటు కోసం పంజాబ్, కోల్ కతా మ్యాచ్ లో పరాజిత జట్టుతో ఆడతారు.
దీంతో తొలి మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశించి ఆనందాన్ని మూటగట్టుకోనుండగా, రెండవ మ్యాచ్ లో ఓడిన జట్టు నేరుగా ఇంటికెళ్లిపోనుంది. కాగా బలాబలాల్లో నాలుగు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. దీంతో భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి.