: రైల్వే మంత్రి తమ్ముడు ఓ స్టేషన్ మాస్టర్


వారిద్దరూ తోడబుట్టిన వారు. వారిద్దరికీ ప్రస్తుతం రైల్వే శాఖతో సంబంధం ఉంది. వారిలో అన్నయ్య రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ అయితే, తమ్ముడు డీవీ సురేష్ గౌడ ఓ స్టేషన్ మాస్టర్. మంగళూరుకు దగ్గర్లోని నందికూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. తన అన్నయ్య, రైల్వే మంత్రి సదానందగౌడ నుంచి తానేమీ ఆశించడం లేదని, కాకపోతే దక్షిణ కన్నడ ప్రాంతంలో రైల్వే నెట్ వర్క్ మెరుగుపరచాలని సురేష్ గౌడ కోరారు. తన అన్నయ్యకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కుతుందని అనుకున్నానే గానీ, రైల్వే శాఖ లభిస్తుందని అనుకోలేదన్నారు.

  • Loading...

More Telugu News