: నా పెళ్లికి గిఫ్టులు వద్దు...విరాళమివ్వండి: అమలాపాల్


తన పెళ్లికి వచ్చేటప్పుడు గిఫ్టులు తీసుకురావద్దని సినీ నటి అమలాపాల్ అతిథులకు విజ్ఞప్తి చేసింది. లవ్ ఫెయిల్యూర్, నాయక్ సినిమాలతో ఆకట్టుకున్న అమలాపాల్ తన పెళ్లి విషయంలో కూడా సామాజిక స్పృహను ప్రదర్శిస్తోంది. అందుకే పెళ్లికి వచ్చే అతిథులు తనకు బహుమతులు ఇవ్వాలనుకుంటే తాను నిర్వహించే ఫౌండేషన్ కు విరాళాలివ్వాలని సూచిస్తోంది. ఈ విషయాన్ని తన వెడ్డింగ్ కార్డులో ప్రింట్ చేయడం విశేషం. తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడిన అమలాపాల్ జూన్ 12న ప్రేమవివాహం చేసుకుంటోంది.

  • Loading...

More Telugu News