: పోలవరం ముంపు బాధితులకు తెలంగాణలోనే ప్రత్యామ్నాయం చూపించాలి: నారాయణ
రాష్ట్ర విభజన సందర్భంగా ఇరు ప్రాంతాల ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. ఇవాళ ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టకుండా సామరస్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు తెలంగాణలోనే ప్రత్యామ్నాయం చూపించాలని నారాయణ డిమాండ్ చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.