: టాప్ 100లో సచిన్, షారూఖ్
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. వస్తువుల క్రయవిక్రయాలకు కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడిపోతున్నాం. ఇష్టాయిష్టాలను పంచుకోవడంలో సామాజిక అనుసంధాన నెట్ వర్క్ లు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నది, సెర్చ్ చేస్తున్నది ఎవరి కోసం అంటూ టైమ్ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. ఆన్ లైన్ లో సెలబ్రిటీలు, గ్లోబల్ లీడర్ల వెబ్ సైట్లు, వీకి పేజీల ఆధారంగా నిర్వహించిన ఈ టైమ్ మ్యాగజైన్ సర్వేలో టాప్ 100లో ఇద్దరు భారతీయులకు చోటు లభించింది.
అమెరికా మజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండవ స్థానంలో నిలిచారు. పాప్ క్వీన్ మడోన్నాకు మూడవ స్థానం దక్కింది. కాగా ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు 68వ స్థానం దక్కగా, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 99వ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ 27వ స్థానంలో నివడం విశేషం.