: చంద్రబాబును ఎదిరించండి, నిలదీయండి: హరీష్ రావు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ గొంతు కోయాలని చూస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పరాయి రాష్ట్రానికి చెందిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో పిచ్చి ప్రేలాపన పేలుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఎదిరించండి, నిలదీయండి అంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డమీద ఉండి తెలంగాణ గొంతు కోస్తుంటే టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చకుంటే ప్రజా, న్యాయ పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News