: తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన యూనివర్శిటీ: రేవంత్ రెడ్డి


టీడీపీ రాజకీయ పార్టీ కాదని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించిన ఒక యూనివర్శిటీ అని ఆయన అన్నారు. ఈ వర్శిటీలో సుశిక్షితులైన కార్యకర్తలు తయారవుతారని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణం చంద్రబాబు నాయకత్వమేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల కోసం ప్రారంభించిన పథకానికి ఆయన రూ.5 లక్షలను విరాళంగా ఇస్తానని మహానాడులో ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ నిర్మాణాత్మకంగా పనిచేస్తుందన్నారు. కేసీఆర్ ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చేవరకు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామని రేవంత్ అన్నారు.

  • Loading...

More Telugu News