: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు
యుగ పురుషుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మహానాడులో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఆమోదించాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలను కోరారు. హైదరాబాదు ఎయిర్ పోర్టులోని దేశీయ విమానాల విభాగానికి (డొమెస్టిక్ వింగ్) ఎన్టీఆర్ పేరు ఉంటే దానిని తొలగించారని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాదుకు తరలించినప్పుడు రాజీవ్ గాంధీ పేరు పెట్టారని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అయితే, డొమెస్టిక్ వింగ్ కు ఎన్టీఆర్ పేరును పెట్టి తీరుతామని ఆయన ప్రకటించారు.