: హైదరాబాద్ లో మరిన్ని ఫ్లైఓవర్లు: సీఎం


హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీపి కబురు చెప్పారు. నగరంలోని  రద్దీగా వుండే ప్రాంతాలలో మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తామని ప్రకటించారు. అంతే కాదు, ట్రాఫిక్ అధికంగా వుండే చోట్ల రహదారులను విస్తరిస్తామని చెప్పారు. నగరంలో అత్యంత రద్దీగా వుండే లక్డీకాపూల్ కూడలిలో నిర్మించిన ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఈ ఉదయం ప్రారంభించారు. దీనివల్ల ఈ మార్గంలో ప్రయాణానికి కొన్ని ఆటంకాలు తొలగినట్లు అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News