: జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 అవసరంలేదు: ఆర్ఎస్ఎస్


జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370పై ఆర్ఎస్ఎస్ తన వ్యతిరేక గళాన్ని లేవనెత్తింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. భారత్ లో జమ్మూకాశ్మీర్ భాగం కనుక ఆర్టికల్ 370 ఉండనవసరంలేదని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రాం మాధవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యానించిన ఆయన, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగం కాదా? లేకుంటే అదేమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తల్లిదండ్రుల ఎస్టేట్ అని ఆలోచిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమేనన్నారు.

నిన్న ఈ అధికరణంపై కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒమర్, జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్ష పార్టీ పీడీపీ మండిపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ ను, భారతదేశంలో కలిపి ఉంచేది ఆర్టికల్ 370 మాత్రమేనని ఒమర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News