: హామీలను అమలు చేస్తాం: బాలకృష్ణ
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబునాయుడితోనే సాధ్యమని, టీడీపీకి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రజలు తమ అభీష్టాన్ని తెలియజేశారని నటుడు బాలకృష్ణ అన్నారు. మహానాడులో ఈ రోజు ఆయన మాట్లాడుతూ... ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటింటికో ఉద్యోగం తదితర హమీలను అమలు చేస్తామన్నారు. అలాగే, ఉద్యోగుల సహకారంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని చెప్పారు. హిందూపురంలో తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.