: 100 స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తాం: వెంకయ్య
దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ బాధ్యతలను ఈ రోజు ఢిల్లీలో చేపట్టిన అనంతరం వెంకయ్యనాయడు విలేకరులతో మాట్లాడారు. దేశంలో 7,935 పట్టణాలు ఉన్నాయని, పట్టణాల్లో జనాభా రోజు రోజుకీ పెరుగుతోందని అన్నారు. 2015 నాటికి దేశంలో సగం జనాభా పట్టణాల్లోనే ఉంటుందన్నారు. నగరాల్లో మెట్రో పనులను వేగవంతం చేస్తామని, రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు. గృహ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.