: మహిళలకు రక్షణనిచ్చే ఎలక్ట్రిక్ బ్రా
కామ పిపాసుల నుంచి తమను రక్షించుకునేందుకు ఆడవారికి సరికొత్త ఆయుధాలు అందుబాటులోకి రావాల్సిందే. ఈ దిశగా చైన్నై నగరానికి చెందిన యువ మహిళా ఇంజనీర్లు అత్యాచారాల నుంచి రక్షణ కోసం ఎలక్ట్రిక్ బ్రాలను కలిసికట్టుగా రూపొందించారు. కీచకులు అత్యాచారం చేయాలని ప్రయత్నిస్తే దుండగులకు ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. అంతేకాదు వెంటనే దాడి సమాచారం జీపిఎస్ పరిజ్ఞానం ద్వారా పోలీసులకూ, బాధితురాలి కుటుంబ సభ్యులకూ చేరిపోతుంది. దేశంలో అత్యాచారాలు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ ఆవిష్కరణ కొంత వరకైనా వాటిని నిరోధిస్తుందని యువ ఇంజనీర్లు భావిస్తున్నారు.