: కేసీఆర్ పోలవరం అడ్డుతానంటే...మేము హైదరాబాద్ పై చాలా అడుగుతాం: సోమిరెడ్డి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అర్డినెన్స్ జారీ చేస్తే అన్యాయం అనిపిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని కోసం ఆర్టికల్ 3ని తిరిగి రాయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని డిమాండ్ల కోసం రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతుందని అన్నారు. హైదరాబాద్ లో సగం ఆదాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. హైదరాబాద్ ను శాశ్వత రాజధాని చేయాలని కోరతామన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.