: సీనియర్ ఐపీఎస్ అధికారిని చితకబాదారు
బెంగళూరులోని ఓ కాఫీ షాపులో సీనియర్ ఐపీఎస్ అధికారి తన సెల్ ఫోన్ తో ఓ యువతిని అసభ్యంగా ఫోటోలు తీశాడు. దీంతో స్థానికులు అతనిని పట్టుకుని చితకబాదారు. అనంతరం ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి రవీంద్రనాధ్ పై ఐపీసీ 354, 506 సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ అభ్యంతరకరమైన ఫోటోలు తీశారని ఆ యువతి ఫిర్యాదు చేసినట్టు డీసీపీ రవికాంత్ గౌడ్ తెలిపారు. అవసరమైతే ఆయనని అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.