: మలాలా 'బాలికల విద్యా నిధి'కి ఏంజెలినా సహాయం
చదువుకోవాలంటే కోరిక, ఆసక్తులే సరిపోవు. అందుకు తగ్గ ధనం కూడా కావాలి. అదేలేక ఎంతోమంది పడుతున్న ఇబ్బందులు చూసి స్పందించిన పాకిస్థాన్ సాహస బాలిక మలాలా 'బాలికల విద్యా నిధి' నెలకొల్పింది. ఇప్పుడు ఈ నిధికి పలువురు నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. ఈ తరుణంలో మలాలా చేస్తున్న కృషికి స్పందించిన హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి రూ.కోటి విరాళంగా ప్రకటించింది.
న్యూయార్క్ లో నిర్వహిస్తోన్న 'ఉమెన్ ది వరల్డ్' శిఖరాగ్ర సదస్సులో మలాలాను జోలి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జోలి.. మలాలాను చంపాలని చూసిన ఉగ్రవాదులే ఆమెలో మరింత స్పూర్తిని రేకెత్తించారని ప్రశంసించింది. బాలికల విద్య పట్ల పట్టుదలతో ముందుకు సాగేలా తాలిబన్లు తమ చర్యతో మలాలాను పురికొల్పారని అన్నారు. అనంతరం మాట్లాడిన మలాలా.. నిధి ద్వారా పాక్ లో మొదటిసారి 40 మంది బాలికల కోసం పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పింది. ఈ ఉద్యమం 4 కోట్ల మంది బాలికలకు విద్యను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.