: ఔటర్ రింగ్ రోడ్డును కలుపుకుని రీజనల్ రింగ్ రోడ్డులు ఏర్పాటు చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రింగ్ రోడ్డును కలుపుకుంటూ రీజనల్ రింగ్ రోడ్డుల నిర్మాణం చేపడతామని అన్నారు. శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరమన్న ఆయన, హైదరాబాద్ ఏ ఒక్కరిదీ కాదని, అందరిదీ అని స్పష్టం చేశారు. మెట్రోరైలు విస్తరణను 70 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు పెంచుతామని కేటీఆర్ చెప్పారు.