: కేబినెట్ భేటీలో నల్లధనంపై చర్చ
కేంద్ర కేబినెట్ భేటీలో నల్లధనంపై వాడిగా వేడిగా చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తొలిసారి సమావేశమైన కేంద్ర కేబినెట్ నల్లధనంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించింది. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని ఎలా రప్పించాలనే దానిపై దృష్టి పెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని సమాచారం.