: విద్యుత్ సమ్మె వల్ల రూ.200 కోట్ల నష్టం?


తమ డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మె చేసిన విషయం విదితమే. దీనిపై విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు విద్యుత్ సౌధాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి సమ్మెకు దిగటం తెలంగాణ వారి సంస్కృతి కాదని, సమ్మెతో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగాణ విద్యుత్ జేఏసీ కో-ఆర్డినేటర్ రఘు అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో సమ్మె చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 2వ తేదీన విద్యుత్ సౌధలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News