: బుడతడు కాదు గడుగ్గాయి... వీడి వీడియో 29 లక్షల మంది చూశారు!


యూ ట్యూబ్ పుణ్యమా అని ఇప్పుడు ఇంట్లో విషయాలు రచ్చకెక్కేస్తున్నాయి. అమ్మ కొట్టినా... పిల్లలు తగువులాడుకున్నా .... ఐటెం ఏదైనా సరే అది తమాషాగా యూ ట్యూబ్ లో దర్శనమిస్తోంది. ఓ ఐదేళ్ళ బుడతడి ముచ్చటను కూడా అలాగే వాళ్ళమ్మ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ బుడతడికి గర్ల్ ఫ్రెండ్స్ వల్ల ఒత్తిడి ఎక్కువైపోతోందట. అందుకని తన ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకరిని వదులుకోవాలనుకుంటున్నానని అంటున్నాడు.

కానీ సమస్య ఏంటంటే, ముగ్గురూ అందంగా ఉంటారని, అందుకే ఎవర్ని వదులుకోవాలో తెలియక తికమకపడుతున్నానని తల్లికి చెప్పాడు. 'ముగ్గురుంటే ఇలా చేస్తావు. మరి ఐదుగురైతే ఏం చేస్తావని' ఆ తల్లి అడిగిన ప్రశ్నకి తడుముకోకుండా, 'నలుగురితోనూ ఉంటా'నని సమాధానమిచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. 'కిడ్ ప్రెటీ కామెంట్స్' అనే ఈ వీడియోను ఇప్పటి వరకు 29 లక్షల మంది చూశారు!

  • Loading...

More Telugu News