: చిత్తూరు జిల్లా అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల హల్ చల్
చిత్తూరు జిల్లా, వి.కోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించాయి. గత మూడు రోజులుగా మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె, దండికుప్పం, మధ్యమాకులపల్లి, కస్తూరి నగరం గ్రామాల్లో ఈ ఏనుగులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమీప అటవీ ప్రాంతం నుంచి కంచె దాటుకుని వచ్చిన ఏనుగులు టమాటా, అరటి, మామిడి తదితర పంటలను నాశనం చేశాయి.