: కదిరి స్టేట్ బ్యాంక్ ఉద్యోగులను ప్రశ్నిస్తోన్న పోలీసులు
అనంతపురం జిల్లా కదిరి భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు జూహా, అశోక్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రైతుల పంటల బీమాకు సంబంధించిన రూ.50 లక్షల దుర్వినియోగం కేసులో వీరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సొమ్మును ఏం చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.