: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం సరికాదు: కేసీఆర్


ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం సరికాదని కేసీఆర్ అన్నారు. సరిహద్దులు మార్చాలంటే రెండు రాష్ట్రాల అసెంబ్లీల అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను తొలి కేబినెట్ తీసుకోరాదన్నారు. తమ సూచనలను ప్రధాని గౌరవిస్తారని భావిస్తున్నానని ఆయన అన్నారు.

పోలవరంపై హోంశాఖ ఆర్డినెన్స్ ను తయారు చేసిందని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ తయారుచేయడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్ ను మార్చాలని కేసీఆర్ అన్నారు. పోలవరాన్ని తాము వద్దనడం లేదని, దాని డిజైన్ పైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. పోలవరం కట్టే ప్రాంతం భూకంపం వచ్చే ప్రాంతంలో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News