: కాంగ్రెస్ ను తిట్టడం చంద్రబాబు మానుకోవాలి: రఘువీరా
'మహానాడు' వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడాన్ని ఆ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఖండించారు. బాబు కాంగ్రెస్ ను తిట్టడం మానుకుని, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. విభజన సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందన్నారు. కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.