: నిరుద్యోగులూ! ఆమ్ వే సంస్థ చెప్పే మాటలు నమ్మవద్దు: ఎస్పీ


నిరుద్యోగులు తమ సంస్థలో చేరి అధిక ఆదాయాన్ని పొందవచ్చంటూ ఆమ్ వే సంస్థ చెప్పే మాటలు నమ్మవద్దని కర్నూలు ఎస్పీ రఘురామిరెడ్డి చెప్పారు. ఈ విషయంలో నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఆమ్ వేలో సభ్యులుగా చేరి వ్యాపారం చేసిన వారు పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ వెల్లడించారు.

నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ ఆమ్ వే సంస్థపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సంస్థ సీఈవో విలిమయ్ స్కాట్ పింక్నిను గుర్గావ్ లో అరెస్ట్ చేసి... ఇవాళ కర్నూలులో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆమ్ వే పై దేశవ్యాప్తంగా వందల కేసులు నమోదయ్యాయని ఎస్పీ రఘురామిరెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News