: వైఎస్సీర్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. దాంతో, ఆ పార్టీకి ఊరట కలిగింది. ఈ మేరకు నిన్న (సోమవారం) వైసీపీకి గుర్తింపు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. మొన్నటివరకు కేవలం రిజిస్టర్ పార్టీయేనని, ఎన్నికల సంఘం గుర్తింపు లేదని.. కాబట్టి, ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళదామనుకుంటున్న నేతలు ఇప్పుడు మనసు మార్చుకుని జగన్ వెంటే ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. అటు ఆ పార్టీ కూడా గుర్తింపు లభించడంతో ఊపిరి పీల్చుకుంది.