: మోడీ ప్రమాణ స్వీకారాన్ని శ్లాఘించిన అమెరికా మీడియా
భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారాన్ని అమెరికా మీడియా స్వాగతించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అధికార మార్పుపై అమెరికా పత్రికా లోకం గొంతెత్తింది. స్వంతగా అఖండ మెజారిటీ సాధించిన మోడీ, మంత్రి వర్గంలో మిత్రధర్మాన్ని అనుసరించడాన్ని అమెరికా మీడియా కీర్తించింది. అరుణ్ జైట్లీని ఆర్ధిక శాఖ మంత్రిగా ఎంపిక చేయడాన్ని ప్రస్తుతించాయి. కాగా, కొన్ని పత్రికలు ఎప్పట్లానే తన స్వతసిద్ధంగా ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కాయి.
'లాస్ ఏంజిలెస్' పత్రిక 'మార్పుకు ముందడుగు...భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం' అని పతాక శీర్షిక పెట్టింది. మోడీతో ఒబామా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను అందులో వివరించింది. 'వాల్ స్ట్రీట్ జర్నల్' 'భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం' అని హెడ్డింగ్ పెట్టింది. 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక 'మోడీకి సమర్థ సేనాని భారత కొత్త ఆర్థిక మంత్రి' అని పతాకశీర్షిక పెట్టింది. 'వాషింగ్టన్ పోస్ట్' మాత్రం తన వైఖరికి తగ్గట్టు 'భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన హిందూ జాతీయవాది' అంటూ వార్త ప్రచురించింది.