: నా కెరీర్ లోనే కష్టమైన సిినిమా కొచ్చాడియాన్: ఏఆర్ రెహమాన్
సంగీతం విషయంలో తన కెరీర్ లో కొచ్చాడియాన్ కఠినమైన సినిమా అని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. సినిమా స్టోరీలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యమే అందుకు కారణమన్నారు. చక్కటి సంగీతాన్ని తీసుకొచ్చిన తన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెబుతూ ఫేస్ బుక్ లో ఈ రోజు పోస్ట్ చేశారు. సంప్రదాయ సంగీతానికి దూరంగా కొత్త దనాన్ని అందించామన్నారు. రజనీకాంత్ నటించిన ఈ సినిమాకు ఆయన కూమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తొలి వారంలోనే 42 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.