: మహిళలకు అండగా ఉంటాం... వృద్ధులకు వెయ్యి పింఛను ఇస్తాం: చంద్రబాబు


ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తామని అధినేత చంద్రబాబు 'మహానాడు' ముఖంగా పునరుద్ఘాటించారు. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని వారికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వృద్ధులకు వెయ్యి ఫించను ఇస్తామన్న హామీ నెరవేర్చుకుంటామన్నారు. ఇక రైతుల బాధలు చూడలేక రుణమాఫీ హామీ ఇచ్చామన్నారు. కానీ, రుణమాఫీని వ్యతిరేకించిన పార్టీ తమను విమర్శించడమేంటి? అని బాబు ప్రశ్నించారు. అటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి రుణమాఫీని అమలు చేయాలని కోరుతున్నారన్నారు.

2019లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, సామాజిక తెలంగాణ కోసం టీడీపీ పోరాడుతుందని చెప్పారు. సీమాంధ్రను స్వర్ణాంధగా మారుస్తామన్నారు. భవిష్యత్తులో ఉంటామో? లేమో? అన్న భయం వైసీపీకి పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ వార్ రూమ్ దేనికి? అని సూటిగా అడిగిన బాబు, తన ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదన్నారు. రాజకీయ లబ్ది కోసం తెలుగుజాతిని వాడుకున్నారని, తెలుగుజాతిని విభజించి అధికారాన్ని అనుభవించాలని కాంగ్రెస్ ప్లాన్ వేసిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News