: మాఫీ ఎందుకు సాధ్యం కాదు?: చంద్రబాబు


రైతులకు రుణమాఫీ ఎందుకు సాధ్యంకాదంటూ ముఖ్యమంత్రిని టీడీపీ అధినేత  చంద్రబాబు నిలదీశారు. దయచేసి ఆయన వ్యవసాయం గురించి తెలుసుకుంటే మంచిదని కూడా బాబు సూచించారు. డబ్బు నిర్వహణ తప్ప... నీటి, విద్యుత్తు నిర్వహణలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని బాబు ఎద్దేవా చేశారు.

గుంటూరు జిల్లా పాదయాత్రలో భాగంగా ఆయన పెదకాకానిలో మాట్లాడారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు మేలు చేస్తామని చెప్పారు. అంతకుముందు చిత్తూరు జిల్లా సహకార సంఘాల ఎన్నికలపై చంద్రబాబు సమావేశమయ్యారు. డీసీసీబీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వొద్దని  నేతలను  ఆదేశించారు.

  • Loading...

More Telugu News