: పీవీకి ఢిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయిస్తాం: మహానాడులో బాబు
పార్టీ మహానాడు కార్యక్రమంలో కాంగ్రెస్ పదేళ్ల పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన సంస్కరణలతో దేశ గతిని మార్చిన ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కనీసం ఢిల్లీలో ఓ స్మారక చిహ్నం కూడా కట్టించకుండా అవమాన పరిచిందని గుర్తు చేశారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో ఆయనకు ఓ మెమోరియల్ ఏర్పాటు చేయించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని సభాముఖంగా బాబు ప్రకటించారు.
ఇక అటు పార్టీ పాలనపై మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ పాలనలో తాగు, సాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, హేతుబద్ధంగా విభజించమని కోరామని తెలిపారు.