: మోడీ చేతిలో అణ్వాయుధాలు!


నూతన ప్రధానిగా పీఠమెక్కిన నరేంద్ర మోడీ చేతిలో ఇప్పుడు పాలనాధికారమే కాదు, శత్రుదేశాలను నాశనం చేయగల అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్ సీఏ) రాజకీయ కౌన్సిల్ కు మోడీయే అధినేతగా వ్యవహరించనున్నారు. ఏ దేశంపైనైనా అణ్వస్త్ర దాడి చేయాలనుకుంటే ఈ అథారిటీయే నిర్ణయిస్తుంది. అంతిమ నిర్ణయం మోడీ తీసుకుంటారు.

అమెరికాలో వలే మన దగ్గర అత్యాధునిక నియంత్రణా వ్యవస్థ లేదు. అమెరికాలో అణ్వస్త్ర దాడులు చేయాలనుకుంటే అధ్యక్షుడి దగ్గర బ్లాక్ బ్రీఫ్ కేసు ఉంటుంది. అందులో కమాండ్ కోడ్స్ ఉంటాయి. అవి అధ్యక్షుడికి మాత్రమే తెలుస్తాయి. ఆయన వాటిని అప్లయ్ చేస్తే అణ్వస్త్రాలు నిప్పులు చిమ్ముతూ శత్రు దేశాలపై దాడికి వెళతాయి. మన దగ్గర మాత్రం హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ శాఖల మంత్రులు సభ్యులుగా ఉండే ఎన్ సీఏ అణ్వస్త్ర దాడులపై నిర్ణయం తీసుకుంటుంది. దానికి ప్రధాని తుది ఆమోదం తెలిపితే త్రివిద దళాలు ఆ బాధ్యతలు చేపడతాయి.

  • Loading...

More Telugu News