: అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడితో మోడీ భేటీ
అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో సమావేశమయ్యారు. నిన్న మోడీ ప్రమాణ స్వీకారానికి కర్జాయ్ అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సార్క్ దేశాధినేతలతో మోడీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో జరిగే భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.