: సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగులు
రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు గత రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. యాజమాన్యంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి విధుల్లో చేరడానికి వారు అంగీకరించారు. దీంతో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తిరిగి ప్రారంభం అవుతుంది. ఉద్యోగులకు 27.5 శాతం మధ్యంతర భృతిని ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.