: మోడీ మంత్రివర్గంలో మరికొంతమంది
నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మరికొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు.
శర్వానంద్ సానో వాల్ తొలిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన బీజేపీలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
ప్రకాశ్ జవదేకర్ తొలిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజసభ సభ్యుడైన జవదేకర్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుడైన పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ జాతీయ కోశాధికారిగా ఉన్న గోయల్ కు 27 ఏళ్ల అపార రాజకీయ అనుభవం ఉంది.
జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతాపార్టీలో కీలక నేత.