: అటవీశాఖ కనుగొన్న 'లంకమల రాక్షస సాలీడు'


కడప జిల్లా అడవుల్లో అటవీశాఖ అధికారులు రాక్షస సాలీడు (టెరంటులా) లను కనుగొన్నారు. ఒక తల్లి సాలీడు, రెండు పిల్ల సాలీడులు మరణించి ఉన్న స్థితిలో ఇవి వాటికోసం అన్వేషిస్తున్న అటవీ అధికార్ల కంటపడ్డాయి. అట్లూరుమండలంలోని అటవీప్రాంతంలో వీటని గుర్తించారుట. కడప యోగివేమన యూనివర్సిటీ, అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీలకు ప్రయోగాల నిమిత్తం వీటిని అప్పగిస్తారు. ప్రస్తుతానికి లంకమల రాక్షససాలీడు అని వీటికి పేర్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు. పైగా ఇవి కొన్ని రకాల ఔషధ తయారీలో ఉయోగపడుతాయని కూడా పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News