: ప్రధానమంత్రి మోడీకి కాంగ్రెస్ శుభాకాంక్షలు
దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. దేశ ప్రజల్లో స్పూర్తి నింపేలా కృషి చేయాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రధాని, మంత్రివర్గానికి హృదయపూర్వకంగా తాము అభినందనలు తెలుపుతున్నామన్నారు. వారు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.