: కేంద్ర మంత్రులు వీరే
ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణస్వీకారం చేశారు. వారు... 1) రాజ్ నాథ్ సింగ్ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
2) వాజ్ పేయి ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన సుష్మాస్వరాజ్, మరోసారి కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.
3) గతంలో న్యాయశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్ జైట్లీ, మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
4) గతంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు, మరోసారి కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.
5) మహారాష్ట్రలోని రాష్ట్ర మంత్రి వర్గంలో పదవులు నిర్వహించిన నితిన్ గడ్కరీ, తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
6) కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానందగౌడ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
7) మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె గతంలో మంత్రిగా పని చేశారు.
8) రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ నజ్మా అక్బరల్ హెప్తుల్లా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఈమె బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
9) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గోపీనాథ్ రావు ముండే తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
10) రాంవిలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన గతంలో కేంద్రమంత్రిగా పలుపదవీ బాధ్యతలు నిర్వహించారు.