: కాసేపట్లో భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
భారత దేశానికి 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సార్క్ దేశాధినేతలను మోడీ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి 4 వేల మంది అతిథులను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కు పటిష్ఠ భద్రత కల్పించారు. అతిథులంతా ఒక్కొక్కరుగా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు.