: సగానికి పడిపోయిన విద్యుదుత్పత్తి
విద్యుత్ సంక్షోభం దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోంది. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో విద్యుదుత్పత్తి సగానికి సగం పడిపోయింది. ఆర్టీపీపీ, వీటీపీఎస్, కేటీపీఎస్ సంస్థల్లో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో 11000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్ కేంద్రాలు 6000 మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కారణంగా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించని పక్షంలో రాష్ట్రాన్ని అంధకారం అలముకోనుంది.