: విభజన సమాచార దస్త్రాలు చంద్రబాబుకు ఇచ్చా: జైరాం రమేశ్
టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా జైరామ్ మీడియాతో చెబుతూ, విభజనకు సంబంధించిన సమాచార దస్త్రాలను బాబుకు ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ నుంచి ఎంపీని కనుక ఆయనకు సమాచారం ఇచ్చానన్నారు. విభజన అంశంపై గత ప్రభుత్వ చర్యలను బాబు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కేసీఆర్ అడిగినా రాష్ట్ర విభజన సమాచారం ఇస్తానని జైరాం పేర్కొన్నారు.