: ఈ రాత్రికి అధికార నివాసానికి మారనున్న మోడీ
ఈ రాత్రికి నరేంద్ర మోడీ 7 రేస్ కోర్స్ రోడ్డులోని అధికారిక నివాసానికి మారనున్నారు. ఈ ఉదయం నుంచే మోడీకి ప్రధాని హోదాలో భద్రతను కల్పిస్తున్నారు. భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత... విదేశీ ప్రముఖులకు రాష్ట్రపతి ఇచ్చే విందులో మోడీ పాల్గొంటారు. అనంతరం తన అధికార నివాసానికి చేరుకుంటారు.