: చంద్రబాబు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంటున్నారు: వైకాపా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఒకప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటూ ప్రశ్నించిన చంద్రబాబు... ఇప్పుడెందుకు దిగజారి వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పులితోలు కప్పుకున్న నక్క లాంటి వాడని ఎద్దేవా చేశారు.