: కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు... గురుతర బాధ్యత ఉంది: చాడా
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కేసీఆర్ కు సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ పై గురుతర బాధ్యత ఉందని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని చాడా స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలు భవిష్యత్ లో కలిసి పని చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.