: ఆదిలాబాద్ లో దారుణం...తల్లిని కడతేర్చిన కుమారులు


ఆదిలాబాద్ జిల్లా భైంసాలో దారుణం చోటుచేసుకుంది. సభ్యసమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మీబాయి (55) అనే మహిళ స్వగ్రామం నుంచి ఉపాధి కోసం భైంసా వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కూలీలు కాగా, ఒకరు ట్రాక్టరు నడుపుతూ, మరొకరు ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. తమ తల్లి ఎవరితోనో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని వీరికి అనుమానం. ఈ నేపథ్యంలో వారు ఈ ఉదయం ఓ శుభకార్యానికి హాజరై వచ్చి, తల్లిని హతమార్చారు.

పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటనా స్థలికి రాగా, తమ తల్లికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, దీనిపై తమకు చాలా కాలంగా ఆనుమానంగా ఉన్నా, ఇప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, అందుకే తల్లిని బండరాళ్లు, కర్రలతో కొట్టి చంపామని అంటున్నారు. ఈ దాడిలో ఇద్దరమే పాల్గొన్నామని, మరో ఇద్దరికి సంబంధం లేదని పోలీసులకు తెలిపారు. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకి పంపి, ఇద్దరు కుమారుల్ని అదుపులోకి తీసుకున్నారు. నివేదిక వస్తే కానీ తామేమీ వ్యాఖ్యానించలేమని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News