: జయలలిత ఆస్తులపై విచారణ నిలుపుదల
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తాత్కాలిక ఊరట కలిగింది. ఈ మేరకు ఆమె ఆస్తులపై బెంగళూరు కోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో జయ బినామీ వాటాదారులుగా జత చేసిన ఆస్తులు తమకు చెందినవని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన లెక్స్ ప్రాపర్టీ డెవలప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో దీనిపై విచారణ ముగిసేంతవరకు తన ఆస్తుల విచారణపై స్టే ఇవ్వాలని జయ కోర్టును కోరారు.