: పాక్ మారకుంటే మోడీ అణు బటన్ నొక్కుతారు: ఉద్దవ్
పాకిస్థాన్ విషయంలో శివసేన మరోసారి తన కఠిన వైఖరి ప్రదర్శించింది. మోడీ ప్రధానిగా అధికారం చేపట్టనుండడంతో మంచి రోజులు రానున్నాయని విశ్వాసం ప్రకటించింది. కాశ్మీర్లోనూ, దేశవ్యాప్తంగానూ శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 'పాక్ ను నమ్మడం కష్టం. కానీ, మోడీ నాయకత్వంపై మాకు నమ్మకం ఉంది. ఆయనకు ఇబ్బందులు కలిగించాలని అనుకోవడం లేదు. పాకిస్థాన్ తన విధానాన్ని మార్చుకోకపోతే మోడీ అణు బటన్ (అణు క్షిపణులను ప్రయోగించడమని ఆయన ఉద్దేశం) నొక్కుతారు' అంటూ శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఓ ప్రకటన జారీ చేశారు.