: ఐస్ క్రీమ్, చాక్ లెట్ తిన్నంత మాత్రాన మూడ్ మారదు!
ఐస్ క్రీమ్, చాక్ లెట్ తిన్నంత మాత్రాన మూడ్ మారదని అంటున్నారు పరిశోధకులు. వీటిని తింటే మంచి మూడ్ వస్తుందన్న విషయాన్ని వారు కొట్టిపారేస్తున్నారు. తినడానికి ఆహారం ఏమీ దొరకనప్పుడు మాత్రం ఐస్ క్రీమ్, చాక్ లెట్ లాంటివి తింటే మంచి అనుభూతి కలుగుతుందని వారంటున్నారు. "నిజానికి ఇది సౌకర్యవంతమైన ఆహారం. మీకు తినడానికి ఏమీ లేనప్పుడు ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు" అని మిన్నెసోటా వర్శిటీ పరిశోధకుడు వాగ్నెట్ అన్నారు.
ఇందుకోసం వాగ్నెర్ ‘చదువుకునే సమయంలో చాక్ లెట్, ఐస్ క్రీమ్ తింటే మీ మూడ్ మారుతోందా?’ అని పలువురు విద్యార్థులను అడిగారు. ఇందులో పాల్గొనే వారికి బాధ, కోపం లేదా భయం కలిగించే 20 నిమిషాల నిడివి గల వీడియోను చూపించారు. తర్వాత వారికి ఐస్ క్రీమ్ తినిపించి, వారు మంచి మూడ్ లోకి వచ్చారేమోనని గమనించారు. కొంతమందికి మామూలు ఆహారం, ఇంకొంత మందికి వారికిష్టమైన ఆహారం ఇచ్చారు. మరికొంతమందికి అసలేమీ ఆహారం ఇవ్వకుండా వారి మానసిక స్థితి ఎలా ఉందో గమనించారు. కేవలం ఆహారం తీసుకోవడం వల్ల మూడ్ మారదని వాగ్నెర్ గ్రహించారు.