: రాజపక్సే అడుగుపెడితే తిరుమల అపవిత్రం: వైగో


వేలాది మంది తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాకతో పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రం అపవిత్రం అవుతుందని ఎండీఎంకే నేత వైగో అన్నారు. రాజపక్సే శ్రీలంకలో వందలాది హిందూ దేవాలయాలను కూల్చేసారని ఆరోపించారు. రాజపక్సే భారత పర్యటనను నిరసిస్తూ, ఢిల్లీలోని పార్లమెంటు వీధిలో ఎండీఎంకే ఆధ్వర్యంలో ఈ ఉదయం భారీ నిరసన ప్రదర్శన జరిగింది.

వైగో నేతృత్వంలో వందలాది కార్యకర్తలు రాజపక్సే దిష్టి బొమ్మను దహనం చేశారు. పోస్టర్లను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేసారు. శ్రీలంకలో తమిళుల ఊచకోతకు భారత్ సైనిక సహాయం అందించిందని, ఇప్పుడు ఆయన పర్యటనకు ప్రభుత్వం భారీ భద్రత కల్పించి రాచ మర్యాదలు చేస్తోందని ఈ సందర్భంగా వైగో అన్నారు.

శ్రీలంక సైనిక దళాలకు, ఎల్టీటీఈ కి మధ్య జరిగిన చివరి దశ పోరులో అమాయకులైన వేలాది మంది తమిళులను బలి తీసుకున్నారని దీనికి రాజపక్సే బాధ్యుడని వైగో ఆరోపించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వీధిలో ప్రధాని నివాసం వైపు ర్యాలీగా బయల్దేరిన వైగొను,
ఎండీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు. 

  • Loading...

More Telugu News