: 'కొచ్చాడియాన్'ను వీక్షించిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్, మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించిన 'కొచ్చాడియాన్' సినిమాను ఆదివారం చెన్నైలో ప్రత్యేకంగా చూశారు. 'విశ్వరూపం'లో ఆయనతోపాటు నటించిన పూజాకుమార్ కూడా కమల్ వెంట ఉన్నారు. వీరిని చిత్ర నిర్మాత, రజనీ కుమార్తె సౌందర్య రిసీవ్ చేసుకున్నారు. చిత్రాన్ని ఆసాంతం కమల్ ఆస్వాదించారని, సౌందర్యను అభినందించారని సమాచారం.